Live Love Laugh...
Article. Published on Sept 03, 2019.

పిల్లలు తమ పరీక్ష ఒత్తిడి మరియు ఆందోళనను తట్టుకునేట్టుగా చూడడానికి తల్లిదండ్రుల కోసం ఒక మార్గదర్శిని

Parent guiding child

విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎంతో ఒత్తిడి ఉంటుంది, అది తల్లిదండ్రులకు కూడా పరీక్షా సమయమే. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల పరీక్షా సిద్ధత స్థితి గురించి ఆందోళన చెందుతూంటే, అది కేవలం మంచుముక్క వంటిది మాత్రమే. వారు సరిగా ఆహారం తీసుకుంటున్నారా మరియు క్రమవారీగా నిద్రపోతున్నారా అనే అంశాల పట్ల మీకు అదనంగా ఆందోళన కూడా ఉంటుంది మరియు ఈ ఆందోళనా సమయం వీలయినంత మృదువుగా గడచిపోవాలని మీరు అనుకుంటారు. మీ పిల్లలకు ఒత్తిడి మరియు ఆందోళన కలిగే సమయంలో మీకు సహాయపడగల కొని చిట్కాలు ఇక్కడ చెప్పబడ్డాయి.

  • కరుణ మరియు సహానుభూతి కలిగి ఉండాలని గుర్తుంచుకోండి: మీ పిల్లవాడు ఇప్పటికే కఠినమైన సమయాన్ని ఎదుర్కుంటున్నాడు. ఇదివరకే ఉన్న కష్ట కాలానికి మీరు మరింత ఒత్తిడి కలిగించకుండా చూసుకోండి.
  • మీ పిల్లవాని కృషిని గుర్తించండి ఈ పరీక్షా సమయాలలో అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుందని గట్టిగా చెప్పడానికి ప్రయత్నించండి మరియు ఇది కేవలం మార్కుల గురించి మాత్రమే కాదని వారికి గుర్తు చేయండి.
  • ీ పిల్లవాడి ఒత్తిడిని కొంతమేరకు తగ్గించండి వారు తక్కువ గ్రేడ్స్ తెచ్చుకోవడం అనేది అంత ముఖ్యమైనది కాదని, అవి వారి భవిష్యత్తును నిర్వచించే కారకాలని వారికి తెలియజెప్పండి. ఇంకా ముందు ఎన్నో అవకాశాలున్నాయని వారికి గుర్తుచేస్తూ, వారి పరీక్షల గురించి వారి ఆందోళన తగ్గించుటలో వారికి తోడ్పడండి.
  • క్రమానుగతంగా నిద్రపోవడం, సరియైన ఆహార అలవాట్ల ప్రాముఖ్యతను మీ పిల్లవారికి నొక్కి చెప్పండి: చదవడానికి మరింత సమయం కోసం వారు నిద్రను, ఆహారపు సమయాలను కొంతమేరకు త్యాగం చేయాలని, ఈ నిద్ర మరియు ఆహారం, రెండూ కూడా వారి మెదడుకు పోషణ ఇవ్వడానికని మరియు వాటిని తమ ఉత్తమ సామర్థ్యంమేరకు పనిచేయడానికి వీలుకల్పించాలని వారికి గుర్తు చేయండి.
  • ఏవైనా సందేహాలు లేదా స్పష్టీకరణలు అవసరమైన సందర్భంలో, మిమ్మల్ని అడగాలని మీ పిల్లలకు చెప్పండి. మీరు వాటికి పరిష్కారం చూపించలేకపోయినా కూడా, వాటిని వినడం వలన, వారు ఆ సమస్యను మౌఖికంగా పరిష్కరించగలిగే ఒక అవకాశాన్నిస్తుంది. ఇతర సందర్భాలలో, పిల్లల దృక్పథం మారినప్పుడు వారి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.
  • వారి ఒత్తిడిపూర్వక ప్రయాణంలో వారికి మానసిక సహకారంతో అండగా నిలబడండి: మీ పిల్లలు తమ భావోద్వేగాలను మీతో పంచుకోవడం, బయటకు వ్యక్తీకరించడం, ఇంకా ఏడవడం కూడా, వారికి సురక్షితమని వారు తెలుసుకునేలా నడచుకోండి.
  • చిన్నచిన్న సమస్యలను పట్టించుకోకండి: ఉదాహరణకు, మీ పిల్లలు తమ గదిని శుభ్రంగా ఉంచుకోకపోయినా లేదా పరీక్షల సమయంలో తాము అంత పట్టించుకోకపోయినా, ఫరవాలేదు. వారి మనసులో ఇతర విషయాలు ఉండి ఉంటాయి.

మొత్తంమీద, మీ పిల్లల జీవితంలోని ఈ కష్ట కాలంలో మీ పిల్లకు ఆసరాగా నిలబడాలని గుర్తుంచుకోండి. మీరు ఇలా చేస్తున్నంతవరకు మరియు పైన తెలిపిన చిట్కాలు పాటించేంత వరకు, వారి పరీక్షల సమయం త్వరగా మరియు సులభంగా గడిచిపోతుమ్ది. ఇంకా, మధ్య మధ్యలో మీరు కూడా విశ్రాంతి తీసుకుని, మీ పట్ల కూడా శ్రద్ధ వహించడం మరవకండి. మీరు ఖాళీ కప్పునుండి ఏమీ పోయలేరు కదా. అంటే మీకు శక్తి లేకపోతే మీరు ఏమీ చేయలేరు కదా.

X