Live Love Laugh...
Article. Published on Jul 11, 2019.

సామాజిక మాధ్యమాలకు బానిసగా మారడం

’సామాజిక మాధ్యమాలకు బానిసగా మారడం’ లేదా ’అంతర్జాలానికి బానిసగా మారడం’ అనేవి అధికారికంగా ఒక రుగ్మతగా పరిగణించబడకపోయినా కూడా, వీటిని దీర్ఘకాలికంగా ఉపయోగించే వారిలో ప్రవర్తనా మార్పుల గురించి చాలామంది మానసిక వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
Think

సామాజిక మాధ్యమ మితిమీరిన వినియోగం

ప్రతిరోజూ సామాజిక మాధ్యమ మితిమీరిన వినియోగం వలన అసంతృప్తి, ఆందోళన, వ్యాకులత మరియు ఆత్మన్యూనత లాంటి భావనలు కలుగుతాయి. (మెక్ డూల్ ప్రభృతులు, 2016). ఈ కారణాల వలన, ప్రజలు, ఈ సామాజిక మాధ్యమంతో తమ సంబంధం పట్ల అవగాహన కలిగి ఉండాలని, మానసికవైద్యులు సూచిస్తున్నారు.

ఈ సామాజిక మాధ్యమాలు అందరిపైన ఒకేరకంగా ప్రభావం చూపకపోయినా కూడా, ఈ సామాజిక మాధ్యమాల వినియోగం మీ ఉత్పాదకతకు ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి, గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

 • మీరు ఉదయం లేవంగానే మొట్టమొదటగా సామాజిక మాధ్యమాల అప్డేట్స్ కోసం మీ ఫోన్ ను చూస్తున్నారా?
 • మీరు రాత్రి పడుకోబోయే ముందు, మీకు నిద్ర రావడం కోసం, మీరు, మీ ఫోన్ లేదా మీ కంప్యూటర్ వద్ద ఎక్కువ సమయాన్ని గడపాల్సిన అవసరం కలుగుతోందా?
 • సామాజిక మాధ్యమాలు మీకు ప్రధానమైనవా లేదా విశ్రాంతి లేదా ఉపశమనం కోసం వినియోగించేవా?
 • మీరు ఇష్టపడని ఇతర భావోద్వేగాలను నివారించుకోవడానికి ఒక విక్షేపంలాగా సామాజిక మాధ్యమాలను మీరు వినియోగించుకుంటున్నారా?
 • ఇతరులతో పోల్చుకొనునప్పుడు మీరు ప్రతికూల ప్రవర్తనను కలిగి ఉన్నారని భావిస్తున్నారా? చాలామంది, ఇతరులు తమకంటే బాగా వినోదిస్తున్నారని అనుకుంటూ, ఎఫ్‌ఒఎంఓ లేదా ’ఫియర్ ఆప్ మిస్సింగ్ అవుట్’ అంటే ’తప్పిపోతుందనే భయం" అనే భావనను కలిగి ఉన్నారా. ఈ ప్రతికూల సరిపోల్చుకోవడం వలన మీరు ఒంటరితనంగా మరియు ఏకాకిగా భావిస్తున్నారా?
 • సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నప్పుడు ఇతరుల పట్ల మీరు తరచుగా అసూయ పడుతున్నారా.
 • ఇతరుల సామాజిక మాధ్యమాల ఫీడ్ వీక్షించడం వలన, అవి మీ లోటుపాట్ల గురించి మీరు ఆలోచించునట్లు చేస్తోందా?
 • చిత్రముల లైక్స్, వ్యాఖ్యలు, అనుసరించువారి సంఖ్య లాంటివి, స్వీయ-విలువ భావనలను గణనీయంగా పెంచడానికి దోహదపడ్డాయా?
 • మీరు ఆన్ లైన్ లో కేటాయించే సమయం వలన మీ పరిసరలాలో ఉన్నవారితో సంబంధాలు తెగిపోయిన భావన కలుగుతోందా?
 • ఇటీవలి కాలంలో, జనులను ముఖాముఖిగా సంభాషించడం మీకు కష్టంగా మారుతోందా?
 • చేయబోవు పనులపై మీ ఏకాగ్రతా సామర్థ్యం తగ్గిపోవడాన్ని మీరు గమనించారా?
 • మీరు సామాజిక మాధ్యమాన్ని ఎక్కువ సేపు వినియోగించిన తరువాత, మీకు తరచుగా తలనొప్పి లేదా అలసట కలుగుతోందా, మీకు ఎక్కువ అలసటగా ఉంటోందని గమనించారా?

Meditate

ఇది మిమ్మల్ని ఎలా భావించేటట్లుగా చేస్తుంది?

ఒక సామాజిక మాధ్యమ అతివినియోగం తరువాత మీపై ప్రభావం ఎలా ఉంటుంది? వాటిని చూడడానికి ముందు గల భావనకంటే చూసిన తరువాత ఇంకా హేయమైన భావన కలిగి ఉన్నారా? అలా అయితే, విశ్రాంతి తీసుకోవడం మంచిది.

మీ వినియోగాన్ని తగ్గించడం ప్రారంభంలో కొంచెం కష్టతరమైనా కూడా, మీరు మరొక పనిని చేయడంలో మీ సమయాన్ని గడపటం వలన వాస్తవ ఆనందాన్ని పొందగలుగుతున్నారని తెలుసుకుంటారు. మీరు సులభంగా మార్పిడి చేసుకోవడానికి, ఇక్కడ మీరు చేయగలిగిన కొన్ని పనులు తెలపబడ్డాయి:

 • సామాజిక మాధ్యమ వెబ్ సైట్స్ లో మీరు గడుపు సమయాన్ని పర్యవేక్షించే ఒక సమయ ట్రాకర్ ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఈ యాప్ వలన మీ సామాజిక మాధ్యమ అలవాట్ల పట్ల అవగాహన కలిగి, పనులలో పడడం మరియు ఉత్పాదకతను పెంచడంలో తోడ్పాటు కలుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.
 • మీ ఆన్ లైన్ సామాజిక సంభాషణలను ఒకే పరికరానికి పరిమితం చేయడానికి ప్రయత్నించండి.
 • సామాజిక మాధ్యమాలను వీక్షించు మీ సమయాన్ని వాటికి బదులుగా, మీకు సహకరించే మరియు మీపట్ల శ్రద్ధవహించే, మీ కుటుంబం మరియు మిత్రులతో గడపడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మీరు ఇతరులతో గడుపుతున్నప్పుడు,మీ ఫోన్ మరియు ఇతర పరికరాలను వాడకుండా జాగ్రత్తవహించండి. ఇలాంటి ఆసక్తులున్నవారితో కలిసి ఉండడం ద్వారా మీ వ్యక్తిగత సన్నిహిత సామాజిక సమూహాలను విస్తరించుకోవడం కూడా ఒక మంచి ఆలోచనే.
 • సామాజిక మాధ్యమాలు అందించే నిరంతర దృశ్య ప్రేరణ వలన, దానిని ఆకస్మింగా వాడకపోయినప్పుడు, వారికి ఆందోళన మరియు అసహన భావనలు కలుగుతున్నాయని చాలామంది నివేదిస్తున్నారు. మీకు జబ్బు భావన, అసంతృప్తి, అసహనం, కలిగినప్పుడు, మీరు వ్యాయామం చేయడం ద్వారా లేదా ధ్యానం చేయడం ద్వారా దానినుండి మీ దృష్టి మరల్చుకోండి.
 • చివరగా, మీరు సామాజిక మాధ్యమాలను తిరిగి వినియోగించునప్పుడు, మీకు కలత కలిగించే వాటిని తప్పించడానికి మీకు మీరే కొన్ని కఠినమైన పరిధులను నిర్దేశించుకోండి.
X