लिव लव लाफ...
వ్యాసం. మే 15, 2019 లో ప్రచురించబడింది.

మహిళల మానసిక ఆరోగ్యం: బహుళ పాత్రలు, బహుళ ఒత్తిళ్ళు

Multiple Roles

మీరెవరు?

ఒక కుమార్తా? ఒక తల్లా? ఒక భార్యా? ఒక గృహిణా? ఒక ఉద్యోగా? ఒక స్నేహితురాలా? ఒక సోదరా? మరియు మొదలైనవి. మహిళలు ఒకే రోజున ఒకే సమయంలో అనేక పాత్రలను పోషిస్తారు. ఈ పాత్రల్లు ఒక్కొక్కింటికి, వారి పై సామాజిక నిర్మాణాలు మరియు ఎంపికల వలన కొన్ని అంచనాలు ఉంటాయి. ఈ పాత్రలకు జోడించబడిన ఒత్తిళ్ళు మరియు అంచనాలు అసలు వాస్తవికమైనవేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?

“ఎక్కడా ఒక సంపూర్ణ మహిళ ఉండదు మరియు ఒక పాత్రను పోషించడానికి ఖచ్చితమైన పద్ధతి కూడా ఉండదు," అని అన్నా చాంది, ద లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్, బెంగళూరులో జరిగిన ’మహిళల మానసిక ఆరోగ్యం’ పై తన ఇటీవలి ఉపన్యాసంలో చెప్పారు.

సామాజిక మానసిక శాస్త్రం ప్రకారం, ’పాత్రలు" అనేవి సామాజికంగా నిర్వచించబడిన నిర్మాణాల నుండి తప్పనిసరిగా పోషించిన రోజువారి కార్యాచరణలుగా ఉంటాయి. ఒక కుమార్తె, ఒక భార్య, ఒక తల్లి మరియు ఒక ఉద్యోగినిగా వివిధ పాత్రలను కలిగిఉన్న మహిళలు, తమ రోజువారి పనులను, ఆశించిన ప్రమాణాలతో పూరించడానికి, తమవంటూ, కఠినమైన నియమాలు, బాధ్యతలు, అంచనాలు మరియు ప్రవర్తనా ప్రమాణాలను రూపొందించుకుంటారు. ఇందుకు విరుద్ధంగా, సంఘటిత సమాజంలోని పురుషులు, సాధారణంగా తమ కార్యాలయ సంబంధిత బాధ్యతలను కలిగిఉంటారు. 


మహిళల కోసం, బహుళ పాత్రల ఆనందం అనేది మరిన్ని ఎక్కువ పనులను చేయడానికి, సమయ అవరోధాలను కలిగించి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాంటి అనానుకూల పాత్రలకు సంబంధించిన ఒత్తిళ్ళు, మహిళలలో ’పాత్రల విభేదం మరియు ఒత్తిడి’ కి దారితీస్తాయి.

అన్నా చాందీ, ఈ సిద్ధాంతాన్ని చర్చిస్తూ ఇలా అన్నారు, "మన జీవితాలలో కొన్ని భాగాలలో మరియు దశలలో కొన్ని పాత్రలు మిగిలినవాటికంటే ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఇది పూర్తిగా సహజమైనది మరియు మహిళలు ఇలాంటి ఎంపిక చేసుకున్నందుకు అపరాధ భావన కలిగి ఉండాల్సిన అవసరం లేదు."

సామాజిక నిర్మాణాల నుండి ఆశించబడిన కొన్ని పాత్రలు, చాలా తరచుగా, మహిళల జీవితంలోని వ్యక్తిగత లక్ష్యాలైన కెరీర్, సంబంధాలు మరియు కుటుంబం వంటి వాటితో విభేదిస్తాయి. అలాంటి అతిపాతం మరియు తికమకలు, వారి మానసిక ఆరోగ్యం పై మరింత ఒత్తిడి ప్రభావాలను కలిగిస్తాయి, మరియు వీటిని పరిష్కరించుకోకపోతే, అవి ఒత్తిడి సంబంధిత రుగ్మతలు, ఆందోళన మరియు కుంగుబాటుకు దారితీయవచ్చు. "ప్రతి పాత్ర కూడా దేనికదే, తీక్షణమైన భౌతిక మరియు మానసిక శక్తిని వినియోగించుకుంటుందని మహిళలు గమనించుకోవాలి. ఈ శక్తి తగ్గిపోయినప్పుడు, అది ఆ పాత్రపై ఒత్తిడి కలగజేస్తుంది," అని అన్నా చాంది అన్నారు.

మహిళలు తీవ్రమైన ఒత్తిడి పాత్రను ఎదుర్కొన్నప్పుడు, వారి అభివృద్ధి తారుమారవుతుంది మరియు మానసిక స్వస్థత నియంత్రించబడుతుంది. ఈ పాత్రల సమతుల్యంలో సతమతమవుతున్న్ అమహిళలు సమానతను ఎప్పటికీ సాధించలేరని అన్నా చాంది సూచించారు. "మనం వివిధ రకాల పాత్రలను సమతుల్యం చేయడానికి తగిన మార్గం కోసం చూస్తాము. దురదృష్టవశాత్తు, ఇది జరగదు," అని ఆమె అన్నారు. 

ఇంకా, ఈ అంచనాలను అందుకోలేకపోతే దానిని మహిళలు అవమానంగా భావిస్తారు. ఈ నింద అంతర్గతంగా ప్రభావం చూపుతుంది మరియు వారి నిశ్శబ్ద బాధను పెంచుతుంది. మహిళలు బాధపడు అనేక మానసిక ఆరోగ్య సమస్యలు తరచుగా వారి భావనలను వ్యక్తీకరించడానికి బదులుగా మనస్సులోనే ఉంచుకున్నందుకు కలుగురాయి. "ఒక మహిళకు ఒత్తిళ్ళు పెరిగినప్పుడు, ఆమె వాటిని నిర్వహించలేక పోయినప్పుడు, మరియు దానిని పరిష్కరించలేకపోతే, అది మానసిక ఒత్తిడికి దారి తీసి, కుంగుబాటును మరియు ఆందోళనను ప్రేరేపిస్తుంది," అని అన్నా చాంది చెప్పారు. మానసిక రుగ్మతలను భౌతిక రుగ్మతలంతగా పట్టించుకోవడం వలన, చాలా సందర్భాలలో, మహిళల నిశ్శబ్ద పోరాటం గమనించబడకుండా మరియు నివేదించబడకుండా పోతుంది.

మానసిక ఆరోగ్యం అనేది మన రోజువారి ఒత్తిళ్ళతో మన జీవితాలు నిర్వహించుకోవడం వంటిది. బాహ్య కారకాల వలన మన జీవితం సంక్లిష్టంగా మారుతూ ఉంటుంది కాబట్టి, సమతుల్యత కలిగి ఉండడం అనేది ఒక సవాలుగా మారింది. అయినప్పటికీ, ఇదేమీ సాధించలేని పని కాదు. మహిళలు, తమ పాత్ర ఒత్తిడిని నివారించుకుని, మానసిక స్వస్థత పొందడానికి, అన్నా చాంది, ఈక్రింది చిట్కాలను సూచిస్తున్నారు.

  • మీరు పోషించు వివిధ పాత్రలను గుర్తించి, అంగీకరించండి
  • మీరు బహుళ-పనులను అద్భుతంగా చేయాల్సిన పని లేదని తెలుసుకోండి.
  • మీకోసం సమయం కేటాయించుకోవడంపై అపరాధ భావన కలిగి ఉండకండి.
  • వ్యాయామం వంటి స్వీయ-కార్యాచరణలలో నిమగ్నం కండి.
  • ఉత్పాదకతను పెంచుకోవడానికి కాలానుగుణంగా విరామాలు తీసుకోండి.

మహిళల మానసిక ఆరోగ్యం గురించిన మరింత సమాచారం కోసం, www.thelivelovelaughfoundation.org కు లాగ్ ఆన్ అవ్వండి

X