लिव लव लाफ...
వ్యాసం. సెప్టెంబర్ 03, 2018 న ప్రచురించబడింది

మహిళల మానసిక ఆరోగ్యం: బహుళ పాత్రలు, బహుళ ఒత్తిడిలు

Multiple Roles

నువ్వు ఎవరు?

ఒక కూతురు? ఒక తల్లి? ఒక భార్యా? ఒక గృహిణి? ఒక ఉద్యోగస్తురాలు ? ఒక స్నేహితురాలు? ఒక సోదరి? మరియు ఇలా ఎన్నో. ప్రతి రోజు ఒక మహిళా ఇలా ఎన్నో విభిన్న పాత్రలను ఏకకాలంలొ నిర్వహిస్తుంది. ఇలాంటి ప్రతియొక్క పాత్రలలోనూ సామాజిక ఒత్తిడిలు మరియు ఎంపికలవల్ల వాళ్ళ మీద ఎన్నో అపేక్షలు కురుస్తాయి. ఈ పాత్రలకు జొతబడిన ఒత్తిడిలు మరియు అపేక్షలు ఇంతకీ నిజమైనవా అని మనం ఎప్పుడన్నా ఆశ్చర్యపడ్డామా?

ఇటీవల బెంగళూరిలో జరిగిన తమ”మెంటల్ హెల్త్ ఫార్ ఉమన్’ భాషణలొ “ఒక పాత్రను నిర్వహించడానికి ఒక పరిపూర్ణ మహిళ లేదా ఒక పరిపూర్ణ దారి అనేది లేదు” అన్నారు అన్నా చండి, లివ్ లాఫ్ లవ్ ఫౌండేశన్ యొక్క ఛేర్ పర్సన్.

సామాజిక మనస్తత్వ శాస్త్రం  ప్రకారం “పాత్రలు” అనేది ముఖ్యంగా ప్రతి రోజూ వారు నిర్వహించే కార్య కలాపాల, సామాజికంగా నిర్వచించిన పనుల మీద ఆధారి పడి ఉంటాయి. ఒక కూతురు, ఒక తల్లి, ఒక భార్యా, ఒక గృహిణి, ఒక ఉద్యోగస్తురాలు, ఇలా ఎన్నో పాత్రల మధ్య తన నైపున్యం చూపించే ఒక మహిళ, ప్రతి రోజూ పాటించవలసిన కొన్ని కఠిణమైన సమూహన్ని కలిగిన నిభంధనలు, బాధ్యతలు, కోరికలు మరియు ప్రవర్తన ప్రమాణాల మీద ఆధార పడియుంటాయి, ఇవి రోజూ వారు జీవించి నెరవేర్చాలని అపేక్షిస్తాయి. కానీ దీనికి విరుద్ధంగా ఒక సామూహిక సమాజంలోని పురుషులు, సామన్యంగా తమ ఆఫీసుకు సంబంధించిన పనులయొక్క జవాబ్దారి గురించి మాత్రమే ధీర్గంగా / ఏకాగ్రతతో ఆలోచిస్తారు.


మహిళలకు, విభిన్న పాత్రలలో నిభాయించే ఒత్తిడి, ఎక్కువ పనులకు, సమయపు ఆభావం మరియు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తాయి. ఇలాంటి ఒత్తిడిలతో నిండిన అనానుకూలమైన పాత్రలు మహిళలలో ’పాత్ర సంఘర్షం మరియు బెణుకుకు’ దారితీస్తాయి

అన్నా చండి, ఈ విషయాన్ని చర్చిస్తూ “కొన్ని పాత్రలు మన జీవితాల్లో అప్పుడప్పుడూ కొన్ని దశలలో మరియూ కొన్ని కాల ఘట్టాలలో మన జీవితాల కన్నా వేరేవాటికే ఎక్కువ ప్రాముఖ్యాని పొందుతాయి. ఇది సంపూర్ణంగా సహజమైనది మరియు మహిళలు ఇలాంటి వాటిని ఎంపిక చేసుకున్నందుకు దోషులుగా భావించనక్కరలేదు” అన్నారు.

చాలా తరచూగా, సామాజిక ప్రభావం వల్ల కొన్ని పాత్రలు ఒక మహిళ యొక్క వైయక్తిక జీవనపు లక్ష్యాలయిన తన వృత్తి, సంబంధాలు మరియు కుటుంబం లాంటివాటిని నిలబెట్టుకోవడం కోసం సంఘర్షన చేయవలిసి ఉంటుంది. ఇలాంటి తిరువులు మరియు గందరగోళం వారి మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. దానిని వెంటనే కుదర్చకపోతే ఒత్తిడికి సంబంధించిన రుగ్మతలు, ఆందోళన మరియు నిరాశకు దారితీస్తోంది. “మహిళలు ప్రతి పాత్రను స్వతంత్రంగా శారీరక మరియు మానసిక శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఈ శక్తి తగ్గినప్పుడు, పాత్రకు బాధకలుగుతుంది,” అంటారు అన్నా చండి.

మహిళలు తీవ్రతరమైన పాత్రల ఒత్తిడిని ఎదురించేటప్పుడు, వారి పెరుగుదల మరియు మానసిక ఆరోగ్యం నియంత్రించబడుతాయి. పాత్రలను సంతులనం చేసెటప్పుడు మహిళలు సమానత్వాన్ని సాధించలేరు. “మనం అందరూ వివిధ పాత్రలను నిభాయించేటప్పుడు, ఒక ఆదర్శ మార్గానికై వెతుకుతాం. కాని దురాదృష్టకరం ఇది జరగదు,” అని ప్రస్తాపించారు అన్నా చండి.

అంతే కాక, మహిళలు ఈ ఆశయాలను సాధించకపోవడం అవమానకరంగా భావిస్తారు. ఈ ఆరోపణ అంతర్గతంగా ప్రతిబింబిస్తుంది మరియు వారి నిశ్శబ్ద బాధను పెంచుతుంది. మహిళలు ఎదురించే చాలా మానసిక ఆరోగ్య సమస్యలు వారు తమ భావనలను బహిరంగంగా వ్యక్తపరచకుండా లోలోపలే దిగమింగటంవలన ఉద్భవిస్తాయి. “ఒక మహిళ యొక్క ఒత్తిళ్లు పెరిగి ఆమె భరించలేక పోయినప్పుడు, మరియు దానికి పరిష్కార మార్గం కనుక్కోకపోతే ఇది మానసిక ధోరణికి దారితీస్తుంది, నిరాశ మరియు ఆందోళనను ప్రేరేపించగలదు,” అంటారు అన్నా చండి. శారీరక రుగ్మతలకు మానసిక రుగ్మతలకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడటంవల్ల, మహిళల నిశ్శబ్ద పోరాటం చాలా సందర్భాల్లో గుర్తించబడదు మరియు నివేదించబడదు.

మానసిక ఆరోగ్యం ముఖ్యంగా మన ప్రతి రోజు ఒత్తిడితో మన జీవితాలను నిర్వహించడం మరియు కలిగి ఉండటం అయినది. మనజీవితాలు బాహ్య కారకాలవలన క్లిష్టకరం అయినప్పుడు బాహ్య కారకాల వల్ల మన జీవితాలు సంక్లిష్టంగా మారడంతో, సమతుల్యతను కొనసాగించడం ఒక సవాలుగా ఎదురవుతుంది. ఇది సంపూర్ణంగా మనవల్ల కాని పనేమీ కాదు. మహిళలకు పాత్ర ఒత్తిడిని నివారించడానికి, ఒత్తిడి తగ్గించడానికి మరియు మానసిక ఆరోగ్యాన్ని సాధించడానికి అన్నా చండి క్రింది చిట్కాలను సూచిస్తారు.

  • ౧. మీరు నిర్వహించే వివిధ పాత్రాలను గుర్తించి అంగీకరించండి.
  • ౨. మీరు మల్టి టాస్కింగ్ లొ అద్భుతమైన గుణాలు ఉంవాల్సిన అవసరం లేదు అనేది అర్థం చేసుకొండి
  • మీ కోసం సమయాన్ని వ్యయించినందుకు దోషిగా అనుభూతి చెందనవసరం లేదు
  • . వ్యాయామం లాంటి స్వీయ కార్యకలాపాలలొ పాల్గొనండి
  • ఉత్పాదకత పేంచడానికి కాలానుగుణ విరామాలను తీసుకొండి.

మహిళల మానసిక ఆరోగ్యానికి సంబండించిన ఎక్కువ మాహితి కొసం లాగ్ ఆన్ చేయండిwww.thelivelovelaughfoundation.org

X