Live Love Laugh...
Article. Published on Sept 27, 2019.

మానసిక ఆరోగ్యంపట్ల కళంకాన్ని తగ్గించడం

భారతదేశంలో మానసిక ఆరోగ్యం సమగ్రంగా పరిష్కరించడాన్ని నిర్ధారించుకోవడానికి, మానసిక జబ్బుతో కూడిన కళంక పరిమాణాన్ని తగ్గించడం ఎంతో అవసరం. సమాజంలో కళంకం ఎంత తక్కువగా ఉంటే, అది వారివారి మానసిక ఆరోగ్యసమస్యలకు వారికి సహకరించుటకు మరియు పరిష్కరించడానికి అంత పోత్సాహం అందిస్తుంది.

బట్టి, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల గురించి వివరించడానికి ప్రతిస్పందనదారులు సగం మంది తమాషా (క్రేజీ) /పిచ్చి(మ్యాడ్) /వెర్రి (స్టుపిడ్) లేదా వైకల్యం (రిటార్డ్) వంటి వివక్షత గల పదాలను ఉపయోగించారు; మరియు 60% మంది ప్రతిస్పందనదారులు మానసిక అనారోగ్యం స్వీయ-క్రమశిక్షణ మరియు సంకల్ప శక్తి లేకపోవడం వల్ల సంభవిస్తుందని నమ్ముతారు, ఈ క్రింది నాలుగు స్థాయిలలో కళంకం పోగొట్టే కార్యక్రమాలపై కేంద్రీకరించడం చాలా ముఖ్యం అని మేము భావిస్తున్నాము మరియు విశ్వసితున్నాము:

పాఠశాల/కళాశాల స్థాయిలో

సాంఘికీకరణలో అన్ని స్థాయిలలోని విద్యాసంస్థలు ప్రాథమిక పాత్ర పోషిస్తాయి. ఈ వాతావరణంలో, పిల్లలు సమాజంలో ఆమోదయోగ్యమైన మరియు ఆమోదయోగ్యం కాని ప్రవర్తనా ప్రమాణాల మధ్య గల తేడాను గుర్తించడం నేర్చుకుంటారు. అదే పరిధిలో, విద్యార్థులు సహచరుల ఒత్తిడి మరియు బెదిరింపులకు ఎక్కువగా గురవుతారు. వివక్షతాపదాల వినియోగం మరియు బెదిరింపులను ఖండించే కార్యక్రమాలను పాఠశాలలో కలిగి ఉండటం అనేది, ఈ పదాలు మరియు పదబంధాలను ఎందుకు నివారించాలో వివరింస్తుంది, మరియు బెదిరింపు వలన కలిగే ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పిల్లలలో సహానుభూతి పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది మరియు మానసిక అనారోగ్యంతో ముడిపడి ఉన్న కళంకాలను మరింత తగ్గిస్తుంది. అదనంగా, సహచరులు, సలహాదారులు మరియు మానసిక ఆరోగ్య నిపుణుల నుండి మద్దతు పొందడం సరైంది మరియు ఆమోదయోగ్యమని విద్యార్థులకు నిరంతరం చెబుతూ ఉంటే, పాఠశాలలు మరియు కళాశాలలు మరింత సమగ్ర సంస్కృతిని ఏర్పరచుకోవడంలో తోడ్పడతాయి.

ప్రొఫెషనల్ స్థాయిలో

పనిచేయు ప్రదేశంలో వివక్షత అనేది మానసిక అనారోగ్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న మరో సమస్య. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తరచూ ఉద్యోగాల కోసం తిరస్కరించబడతారని and పదోన్నతుల విషయంలో పట్టించుకోబడరని, అధ్యయనాలు సూచిస్తున్నాయి, ఇది వారి మానసిక అనారోగ్యం గురించి మాట్లాడటంలో వారి నిష్కాపట్యతకు కారణమని వారు సూచిస్తున్నారు. పనిచేయు ప్రదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలను వెల్లడించడం వలన నిర్వాహకులు మరియు మైక్రో మేనేజ్మెంట్ వంటి ఇతర సహచరులు వ్యక్తీకరించే ఇతర వివక్షత ప్రవర్తనలకు, మానసిక అనారోగ్యానికి తప్పులను అనుసంధానించడానికి, వ్యర్థ ప్రసంగాలకు మరియు సామాజిక మినహాయింపుకు దారితీయవచ్చు. కళంకం మరియు దాని ఫలితంగా కలిగే ప్రవర్తనలు ఈ క్రింది కల్పనలను కలిగి ఉంటాయి: మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు పని లేకపోవడం వల్ల పని యొక్క డిమాండ్లను చేరుకోలేరు; మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ప్రమాదకరమైనవారు లేదా అనూహ్యమైనవారు; మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పనిచేయడం వారికి అంతగా ఆరోగ్యకరమైనది కాదు; మరియు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపాధి కల్పించడం అనేది దాతృత్వ చర్య. ఈ కల్పనలకు, నిర్దిష్ట పరిస్థితిని బట్టి వాటి తీవ్రత మారుతూ ఉంటుంది. పనిచేయు ప్రదేసంలోని కళంకాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, కార్యాలయంలో ఈ క్రింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యూహాలను అవలంబించవచ్చు:
  • పనిచేయు ప్రదేశంలో, తగినంత మానసిక ఆరోగ్య తోడ్పాటు: మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉండడం, సంస్థ యొక్క ఆరోగ్య బీమా ప్యాకేజీలో కవర్ చేయవలసిన మానసిక ఆరోగ్యం మరియు మొదలైనవాటితో సహా
  • మానసిక ఆరోగ్య అవగాహన మరియు ఉత్తేజనా కార్యక్రమాలు కలిగి ఉండడం
  • కలుపుగోలు భాష వినియోగం
  • పనిచేయు ప్రదేశ కళంకానికి అపరాధశిక్ష

వైద్యుని స్థాయిలో (సాధారణ ప్రాక్టీషనర్స్/జిపిలు)

అనేక మానసిక అనారోగ్యాలు శారీరక లక్షణాలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, వ్యాకులత అనేది, వేగంగా బరువు తగ్గడం లేదా బరువు పెరగడం మరియు శక్తి లేదా ప్రేరణ లేకపోవడానికి దారితీయవచ్చు. ఇలాంటి సందర్భంలో, బాధపడుతున్న వ్యక్తి వారికి కలిగే అసౌకర్యానికి మూలాన్ని గుర్తించలేకపోతే, వారు సాధారణ వైద్యుని సంప్రదించవచ్చు. భారతదేశం వంటి దేశాలలో చాలామటుకు కుటుంబాలకు తమకు సౌకర్యంగా ఒక కుటుంబ వైద్యుడు లేదా ఒక వైద్యుడు ఉండే ఇలాంటి సంస్కృతులకు ఇది సరిగ్గా సరిపోతుంది. అందువల్ల, సాధారణ వైద్యులు మానసిక అనారోగ్యం గురించి సున్నితంగా ఆలోచించగలరని నిర్ధారించుకోవడం చాలా అవశ్యకం. మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన లక్షణాలపై ఎక్కువ శ్రద్ధ చూపగలిగే వైద్యులను కలిగి ఉండడం ద్వారా, మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది అనే అపోహను తొలగించడంలో మేము సహాయపడతాము. ఇంకా, సాధారణ వైద్యులు, ఉత్తేజితులైనప్పుడు, బాధపడే వ్యక్తికి మరియు మానసిక వైద్యుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల మధ్య వారధిగా వ్యవహరించవచ్చు. మానసిక ఆరోగ్య పద్ధతులకు మరియు అభ్యాసకులకు మద్దతు ఇచ్చే జిపిని కలిగి ఉండటం వలన, బాధపడే వ్యక్తికి కలిగిన స్వీయ-కళంకం తగ్గుతుంది; ఇంకా, తోడ్పాటు కోసం ప్రయత్నించడం సరైందే అనే ఆలోచనను మరింత బలోపేతం చేస్తుంది.

సంఘ స్థాయిలో

సంఘ స్థాయిలో, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల పట్ల విద్య మరియు ఉత్తేజనాన్ని వినియోగించుకోవడంతో పాటు, సాధారణ ప్రజలు మరియు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల మధ్య మరింత అనుబంధాన్ని ప్రోత్సహించడానికి కీలకమైనది మరియు మానసిక అనారోగ్యాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలతో ప్రజలను మానవతను పెంపొందించడానికి సహాయపడుతుంది మరియు ఈ అనారోగ్య ఉనికిని సాధారణ స్థాయికి తీసుకురావటంలో తోడ్పడుతుంది, తద్వారా సమాజంలోని వ్యక్తులు మరింత సహానుభూతిని పెంపొందించుకోగలుగుతారు. ఈ అనుబంధాన్ని ప్రోత్సహించడం వలన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు వారి పరిస్థితికి, బాధ్యులుకారని అర్థం చేసుకోవచ్చు మరియు ఇది వారి పట్ల అసహ్యం మరియు కోపం లాంటి భావాలను తగ్గించుకోవడంలో తోడ్పడుతుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి తోడ్పాటు అందించడం, వారి పట్ల శ్రద్ధ వహించడం మరియు వివక్ష చూపకుండా ఉండడమనే బాధ్యత సమాజానికి ఉంది.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను వీక్షించే పద్ధతిని మార్చడానికి, దైహికమైన మార్పు ఆవశ్యకమైనది. ఏరకమైన కళంకమైనా కూడా:స్వయంగా-చేసుకున్నది లేదా బయటనుండి కలిగింది; అతి పెద్ద అడ్డంకిగా ఉండవచ్చు. వ్యక్తులు తమపై మరియు ఇతరులపై కూడా కళంకాలు వేయడంలో సిద్ధహస్తులని గుర్తించడం చాలా ముఖ్యం. అందుచేత, ఏదైనా మార్పు తీసుకురావాలంటే, దానికి వ్యక్తిగతమైన మరియు దైహికపరమైన సవరింపు అనేది అవసరం.
X